హామీలు అమలు చేయమంటే.. అరెస్టులు చేస్తారా?

Jan 22,2024 14:38 #Bapatla District
bapatla anganawadi arrest chalo vijayawada

చీరాలలో అంగన్వాడి కార్యకర్తలు అరెస్టు

ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలింపు

ప్రజాశక్తి చీరాల : విజయవాడలో జరగనున్న ధర్నాలో పాల్గొనేందుకు వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను బస్టాండు రైల్వేస్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టు చేసిన అంగనవాడి 9 మందిని చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ.. అంగన్వాడీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని అధికారం చేపట్టాక అమలు చేయమని అడుగుతుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటు అని అంటున్నారు. సోమవారం రాష్ట్ర పిలుపు మేరకు అంగన్వాడీల సమస్యల పరిష్కారం నేడు విజయవాడలో జరగనున్న ధర్నాలో పాల్గొనకుండా అక్రమంగా అరెస్టు తమన్న భయభ్రాంతులకు గురి చేయడమే అన్నారు. అంగన్వాడీలను అన్నిచోట్ల పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఈపాటికి నోటీసులు జారీ చేశారని అన్నారు. ప్రభుత్వం తమపై కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని అన్నారు.అరెస్టులతో నోటీసులతో తమను భయపెట్టాలని చూస్తే అది ప్రభుత్వం అవివేకమనే అన్నారు.కావున ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకోవాలి అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అరెస్టును సీఐటీయూ నాయకులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు లు తీవ్రంగా ఖండించారు.తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

➡️