శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పందిళ్లపల్లిలో నాగార్జున రెడ్డి పై దాడి

19 ఆగస్టు, 2026

Attack on Nagarjuna Reddy in Pandillapalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన నాయుడు నాగార్జున రెడ్డి పై కొందరు యువకులు దాడి చేసి గాయపరిచిన సంఘటన వేటపాలెం మండలం పందలపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. అందిన వివరాల మేరకు ... ఇసుక క్వారీల పై నాగార్జున రెడ్డి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అధికారులు ఇసుక క్వారీలను పరిశీలించేందుకు రాగా వారి సమక్షంలోనే కొందరు యువకులు నాగార్జున రెడ్డి పై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చెవికి, చేతికి తీవ్ర గాయం కావటంతో మెరుగైన వైద్యం కోసం చీరాల వైద్యులు గుంటూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్