బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రతా చర్యలు : జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్

29 జులై, 2026

Robust security measures for EVM warehouse: District Collector M.N. Harendhira Prasad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 02:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : ఈవీఎం, వీవీపాట్స్ గోదాముకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవిన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ఈవీఎం గోదామును పరిశీలించారు. ఈ సందర్భం గా గోదామును క్షుణ్ణంగా పరిశీలించి ఈవీఎంలు, వి విపాట్స్ కి భద్రతకు తీసుకుంటున్న చర్యలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ .... ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్), వీవీపాట్స్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెవిన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ప్రతి నెలా ఈవీఎం గోదామును తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు, వి వి పాట్స్ తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీ నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.టి.తిప్పే నాయక్, కాకినాడ అర్బన్ తహశీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం. జగన్నాథం,ఇతర ఎన్నికల సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్