మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జగజ్జివన్‌ రామ్‌, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి

04 ఏప్రిల్, 2026

polavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఏప్రి 04, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పోలవరం : రాబోయే అంబేద్కర్‌ జయంతి, బాబూ జగజ్జివన్‌ రామ్‌ జయంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని పోలవరం మండలంలో విగ్రహాల పరిరక్షణకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ ఆదేశాల మేరకు మండలంలోని బాబు జగజ్జీవన్‌ రామ్‌, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలవరం స్థానిక అంబేద్కర్‌ వద్ద కమిటీ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎస్సై పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ, జయంతి వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విగ్రహాల వద్ద నిరంతర నిఘా ఉంచుతూ, అనుమానాస్పద పరిణామాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో జయంతి వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్