Aug 19,2022 14:59
  • ఇద్దరు విద్యార్థులకు గాయాలు

ప్రజాశక్తి-ఆస్పరి : మండల పరిధిలోని జోహారపురం గ్రామంలో శుక్రవారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఇద్దరి విద్యార్థులను గాయపరిచింది. కృష్ణ అష్టమి సందర్భంగా స్కూల్ లకు సెలవు రావడంతో విద్యార్థులు ఇంట్టి దగ్గర ఆడుకుంటున్న చాకలి మహేష్, కురువ వినాయ్ లను కరిచింది. పిచ్చి కుక్కను చూసి గ్రామస్తులంతా భయందోళనల కు గురయ్యారు. వెంట పడి పిచ్చికుక్కను చంపడంతో గ్రామస్తులు ఊపిరి పిలుచుకున్నారు. బాలురులను ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నికి తీసుకెళ్లారు.

  • పిచ్చుకుక్క కాటుకు మందులు కొరత

ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిచ్చి కుక్కకాటుకు మందులు కొరత ఉంది. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంచి కుక్కలతో పాటు పిచ్చి కుక్కల కు గురైన వారికి ఇంజక్షన్ ఇవ్వాలి. కాని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం పిచ్చి కుక్క కాటుకు అవసరమైన మందులు అందుబాటులో లేవు.శుక్రవారం ఉదయం జోహరపురం గ్రామానికి చెందిన చాకలి మహేష్,కురువ వినయ్ లకు పిచ్చి కుక్క కొరికితే మందులు లేక ఆదోని ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు. మంచి కుక్క కాటుకు గురైన వారికి కూడా పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. ఒకే ఒక్క ఇంజక్షన్ ఉండడంతో చాలా దారుణం. ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పిచ్చి కుక్క కాటుకు మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేశారు.