Sep 22,2022 12:13

న్యూఢిల్లీ :   ఉద్యోగులకు మీషో కంపెనీ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంకోసం విరామాన్ని కల్పించింది. రెండవ ఏడాది ప్రారంభానికి ముందు ఉద్యోగులకు 11 రోజుల పాటు ''రీసెట్‌ అండ్‌ రీచార్జ్‌'' పేరుతో సెలవులను ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ కామర్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, సిటిఒ సంజీవ్‌ బర్న్‌వాల్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యానికి ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రెండవ ఏడాది ప్రారంభానికి ముందు 11 రోజుల విరామం ప్రకటించామని, అక్టోబర్‌ 22 నుండి నవంబర్‌ 1 వరకు మీషో సేవకులు విరామం తీసుకుంటారని అన్నారు. బిజీ పండుగ విక్రయం అనంతరం పనినుండి విరామం కల్పించడం వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమని ప్రకటించారు.