Jul 03,2022 22:49
  • నిమిషం ఆలస్యమయినా నో ఎంట్రీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇఎపిసెట్‌ పరీక్ష సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు, 11, 12 తేదీల్లో బైపిసి విద్యార్థులకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.84 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఎపిలో 120, తెలంగాణాలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడుగంటల నుండి ఆరు గంటల వరకూ రెండు పూటలా పరీక్ష జరగనుంది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించే లేదని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌తో పాటు ఫోటోతో ఉన్న గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తును విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని దానిపై ఫోటో అతికించి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు అందించాలి. ఏదైనా సందేహం ఉంటే హెల్ప్‌లైన్‌ నెంబర్లు 08554-234311, 232248, మెయిల్‌ [email protected] సంప్రదించాలి.