
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) షాకిచ్చింది. సుప్రీంకోర్టులో ఇడి కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఇడి పేర్కొంది. తమ వాదన విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఇడి విజ్ఞప్తి చేసింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఇడితో పాటు కవిత తరపు న్యాయవాది వాదనలు కూడా న్యాయస్థానం విననుంది. కేవియట్ పిటిషన్ దాఖలుతో కవిత తరపు వాదనలు, ఇడి తరపు వాదనలు సుప్రీంకోర్టు విననుంది. ఇడి తనను విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపింది.