Oct 17,2020 11:32

తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ శబరిమల దేవాలయం శనివారం తెరుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ..పలువురు దేవాలయాన్ని సందర్శించుకున్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఏడు నెలల పాటు మూత పడ్డ..శబరిమల ఆలయం.. శుక్రవారం తెరుచుకుంది. అయితే శనివారం నుండి భక్తులకు అనుమతినిచ్చారు. ఆలయాన్ని సందర్శించే వారూ తప్పకుండా మాస్క్‌ ధరించాలని, కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే ఆలయంలోకి అనుమతిస్తామని నిబంధనలు జారీ చేసింది. నెలవారీ పూజా కార్యక్రమంలో ఐదు రోజుల మాత్రమే దేవాలయం తెరుచుకుంటుంది. ప్రతి రోజూ కేవలం 250 మందికే అనుమతినిస్తున్నారు. శనివారం దేవాలయాన్ని దర్శించుకునేందుకు 240 మంది బుక్‌ చేసుకున్నారు.