రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అనేక మంది అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో చట్ట విరుద్ధంగా వ్యవహరించడం, అక్ర మాలకు పాల్పడిన విషయాలు పత్రికల్లో ఆధారాలతో సహా వస్తున్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఒత్తిడితో పాలకులు అటు వంటి వారిని బదిలీలతో సరిపెట్టడం చూస్తున్నాం! బదిలీ అయితే సదరు ఉద్యోగికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అక్కడ కూడా తన అక్రమాలను అదేవిధంగా కొనసాగిస్తాడు? ఇక బాధి తులకు స్వాంతన ఎక్కడీ కావున ఇలాంటి ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే ఇలాంటి తప్పులకు అడ్డుకట్ట పడుతుంది! ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ వీళ్ళు కూడా లాలూచీ రాజకీయం చేస్తున్న పోకడలు కనబడు తున్నాయి! ఇలాగైతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఇది అరాచకానికి దారితీస్తుంది!
– గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ఏలూరు జిల్లా.