పరీక్షల ప్రక్షాళన అవసరం

Sep 29,2024 04:45 #Articles, #editpage, #Exams

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మూడు రకాల పద్ధతుల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. కొన్ని పరీ క్షలను సి.బి.ఏ పద్ధతిలో, మరికొన్ని పరీక్షలను వాట్సాప్‌ ద్వారా పంపిన పేపర్ల ద్వారా, ఇంకొన్ని పరీక్షలను ముద్రించిన పేపర్లను పంపిణీ చేసి నిర్వహిస్తుంది. సి.బి.ఏ పద్ధతిలో నిర్వహించే పరీక్షలకు ఓ. ఎం.అర్‌ షీట్‌ కూడా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటు న్నాయి. పాఠ్య పుస్తకాలలో అంశాలు పెద్దగా ఇందులో రావడం లేదు. వాట్సాప్‌ ద్వారా పంపే పేపర్లు చాలా సులభంగా ఉంటున్నాయి. అయితే పేపర్స్‌ను జిరాక్స్‌ తీయించి పరీక్ష నిర్వహించాలంటే ఉపాధ్యాయ సిబ్బం దికి ఇబ్బందిగా ఉంటుంది. ఇందుకు అయ్యే ఖర్చులను వారే భరిస్తున్నారు. సమ్మటివ్‌ పరీక్షా పత్రాలను మాత్రం డి.సి.బి. ఈ పంపిణీ చేస్తుంది. ఓకే ఏడాది మూడు రకాల పద్ధతులలో పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యా ర్థులకు పరీక్షా విధానంపై సరిగ్గా అవగాహన ఏర్పడటం లేదు. పరీక్షల విధానంలో మార్పులు అవసరమని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. విద్యార్థులకు సిలబస్‌పై అవగాహన రావాలంటే ఒకే రకమైన పరీక్షా విధానం ఉండాలి. ప్రభుత్వమే అన్ని పరీక్షా పత్రాలను పంపిణీ చేయాలి.

– యం. రాం ప్రదీప్‌, తిరువూరు.

➡️