ప్రజలంటే….?

Jun 8,2024 05:40

ప్రజలంటే తేలిక కాదు.
ఓటు అంటే నాలుక కాదు
ఓ ఆలోచనకు ఆగ్రహమొస్తే
ప్యాలెస్లు కూలతాయి.

ప్రజలంటే చులకన కాదు
సిద్ధం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు.
ఓ ఆచరణ మొదలైతే
ఓటమి బటన్‌ నొక్కుతారు.

ప్రజలంటే పలుచన కాదు
డబ్బుతో కొనుక్కునే పశువులు కారు
తమను తాము కాపాడుకునే
నిజంతో నడిచే బలంవంతులు.

ప్రజలంటే పిచ్చివాళ్ళు కారు
మౌనంగా అన్నీ వింటూ
మనసుతో నడుచుకొనే
ఓటు విలువ తెలిసిన విలువైన వాళ్ళు.
– చందలూరి నారాయణరావు,
సెల్‌ : 9704437247

➡️