ఓటర్లూ! రండి! లేచి రండి
కదలి రండి! తరలి రండి
గడప దాటి గబగబా
ఇళ్లు వీడి ఓట్లేయ్యడానికి
ఎన్నికల జాతరకు రండి
అలసత్వాన్ని అణిచి
ఓట్లకు దూరమనే భావనను
మది నుండి తొలిచి
కూతవేటు దూరాన
వెలసిన పోలింగ్ బూత్‌కు
సులభతరంగా స్వేచ్ఛగా
ఓటు హక్కు వినియోగానికి
రండి! రారండి!
ఎందుకో నామోషీ
ఒక్క క్షణం ఆలోచించండి
ఓట్ల విలువ తెలియు
విధిగా ఓట్లేయడం
హేతుబద్ధమైన ఆలోచన
ఓట్లను విజ్ఞతతో వేస్తే
ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో
ఓట్లేయటమే కావాలి లక్ష్యం
తప్పకవుతుందది సాధ్యం!
ఓట్ల విలువేమిటో తెలుసుకో
మీ ఓట్లు చాలా అమూల్యం
మీ ఓట్లు దేశ భవిత కోసం
ఇంకెందుకు ఆలస్యం?
– డా. సి.ఎల్.చెన్నారెడ్డి
ఎస్వీ జూనియర్ కళాశాల,
సెల్ : 9885791661