నిన్న తెలంగాణ హైకోర్టు మంచి తీర్పు చెప్పింది. ఓ టాలీవుడ్ హీరో కుమారుడి వివాహానికి సంబంధించి ఆ బంధం ఎక్కువ కాలం నిలవదని, విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణుస్వామి పైన వారు మహిళా కమిషన్‌కు వెళ్లగా, మహిళా కమిషన్ వేణుస్వామిపై చర్యలకు అదేశించింది. ఈ విషయమై వేణు హైకోర్టుకు వెళ్లగా నిన్న మహిళా కమిషన్ ఆదేశించిన చర్యలను సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. జాతకాల పేరుతో, జ్యోతిష్యం పేరుతో మోసం చేసేవారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కాగలదు. ఇదే వేణుస్వామి గత ఎన్నికల సమయంలో తెలంగాణలో కెసిఆర్ మూడోసారి గెలుస్తాడని చాలెంజ్ చేశాడు. ఇక్కడ జగన్ గెలుస్తాడని కూడా సవాల్ చేశాడు. రెండు చోట్లా ఆయన చెప్పిన జాతకం తిరగబడింది. ప్రపంచంలోనే జ్యోతిష్యం నిజమని ఇంతవరకూ రుజువు కాలేదు. 1975లో ప్రపంచం లోని వివిధ రంగాల శాస్త్రజ్ఞులు 192 మంది జ్యోతిష్యం అబద్దం, బూటకం అని చెప్పారు. వీరిలో 17 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు. అమెరికన్ హేతువాది జేమ్స్ రాండి ప్రపంచంలోని జ్యోతిష్కులను సవాల్ చేశాడు. మీ జ్యోతిష్యం నిజమని నిరుపిస్తే రూ.5 కోట్ల బహుమతి ఇస్తానని 40 సంవత్సరాల నుండి సవాల్ చేస్తున్నాడు. ఒక్కరూ ముందుకి రాలేదు. ప్రజల అమాయకత్వం వలన జాతకాల పేరుతో, జ్యోతిష్యం పేరుతో మోసం చేసే ఆవారా గాళ్లు పెరిగిపొయారు. కనుక వేణు స్వామికి మహిళా కమిషన్ విధించిన శిక్షను, నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పుని దృష్టిలో పెట్టుకుని…ఇలాంటి మోసకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
– నార్నె వెంకట సుబ్బయ్య