మేలుకో ఓటరూ!

Apr 2,2024 06:10 #edit page

ఐదేళ్ళకాలం రానేవచ్చింది
గత స్మృతుల వ్యధలు
గత జ్ఞాపకాల బాధలు
గడిచిన కాలపు వేదనలు
జరిగిన ఆకలి రోదనలు
గుర్తుతెచ్చుకో.. ఓటరూ!

మీ బంధువునంటూ
మీ స్నేహితుడంటూ
మీ కులపోడంటూ
మీ బిడ్డనంటూ
కపట ప్రేమకు పడిపోకు

తాయిలాలకు
తహతహలాడితే
తనువంతా పుండవుతుంది
భరణెలకు ఆశపడితే
భవితవ్యం బరువవుతుంది
మద్యానికి చిందులేస్తే
భవిష్యత్‌ భారమవుతుంది
ముక్కు పుడకలకు మోజుపడితే
జీవనం మోడవుతుంది

విజ్ఞతతో వ్యవహరించు
తెలివిగా ఆలోచించు
అభివృద్ధికి ఓటు వెయ్యి
సుపరిపాలనకు చోటియ్యి.

– కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 7780277240

➡️