గత ప్రభుత్వం సోలార్ విద్యుత్ సరఫరా కోసం సెకి సంస్థతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి చోటు చేసుకోవటమే కాకుండా రాష్ట్రానికి అధిక మొత్తంలో భారం పడుతుంది. ఒప్పందం రద్దు చేయకపోతేే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో కేంద్రం ఒత్తిడికి తలొగ్గినట్లు ప్రజలు భావించే ప్రమాదం ఉంది. గతంలో ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అపఖ్యాతి పాలయ్యారు. సెకి ఒప్పందం రద్దు చేసుకుంటే చెల్లించవలసిన పరిహారం న్యాయస్థానంలో తేల్చుకోవచ్చు! ఒప్పందమే అవినీతి అయినప్పుడు షరతులకు చట్టబద్ధత లేదు.
– గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ఏలూరు జిల్లా.