కేసుల పురోగతి ఏదీ?

Jul 13,2024 08:36 #Any progress, #cases?

మూడు సంవత్సరాల క్రితం జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జరిగిన అవక తవకలపై ఫిర్యాదు చేయడంతో పలు అవకతవకలు వెలుగు చూడటం, కొంత మంది బాధ్యులను గుర్తించడం జరిగింది. అయితే దర్యాప్తు అసంపూర్తిగా జరగడం, అసలు సూత్రధారులను గుర్తించకుండానే విషయం మరుగున పడిపోయింది. ఆపైన తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా ఓటర్ల నమోదు, తొలగింపు, జాబితాల తయారీలో అనేక అక్రమాలు వెలుగు చూడటం, కేసులు నమోదు కావడం చూశాం. అలాగే నామినేషన్‌ పత్రాల పరిశీలనలో, ఎన్నికల ప్రచారం లోనూ, పోలింగ్‌ రోజున పోలీసులు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నియమించ బడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో పాలక పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం, దీనిపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేయడం జరిగింది. వీటన్నింటిలో ఎన్నికల సంఘం వారు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇవిఎంలు ధ్వంసం చేసిన వారు, దానిపై ఉదాసీనంగా వ్యవహరించిన పోలింగ్‌ సిబ్బంది, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– గరిమెళ్ల రామకృష్ణ,
ఏలూరు, ఏలూరు జిల్లా.

➡️