బదిలీల షెడ్యూల్‌

Jul 18,2024 03:52 #editpage

రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ-2024 ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రిక్రూట్‌మెంట్‌ జరిగే లోపు సాధారణ, రిక్వెస్ట్‌ బదిలీలు జరపాలని అన్ని ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించి బదిలీల విధానాన్ని, షెడ్యూల్‌ని రూపొందించి డిఎస్సీ-2024 భర్తీకి ముందే బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూళ్లలో డిఎస్సీ-2018 ఉపాధ్యాయులకు బదిలీలు జరపాలి. టీచర్స్‌ రిక్రూట్మెంట్‌ జరిగే షెడ్యూల్‌కు ముందుగానే ప్రమోషన్లు కల్పించాలి. బదిలీల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేసి ఖాళీలన్నీ చూపి డిఎస్సీ ముందే బదిలీలు జరపాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
– బి. సురేష్‌,
శ్రీకాకుళం జిల్లా.

➡️