ఒకే నిష్పత్తిలో ఉపాధ్యాయులను ఇవ్వాలి

Apr 19,2025 03:16 #Agitated teachers

ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక తరగతులకు, మిగిలిన ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లకు టీచర్‌ పీపుల్‌ నిష్పత్తిలో తేడాలుండకూడదు. అన్ని రకాల స్కూళ్లలోనూ ప్రాథమిక తరగతులు బోధించే ఎస్జీటీ పోస్టులను కేటాయించడంలో వ్యత్యాసాలు వుండకూడదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల ఫౌండేషన్‌ స్కూళ్లు, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక తరగతులున్న అన్ని స్కూళ్ల నందు ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి ఒకే విధంగా ఉండేలా చూడాలి. బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో 20 మంది వరకు ఒక ఎస్జీటీ, 21 నుంచి 60 వరకు 2 ఎస్జీటీలు, 60 నుంచి 90 వరకు 3 ఎస్జీటీలు ప్రభుత్వం కేటాయిస్తున్నది. అదేవిధంగా ఫౌండేషన్‌ స్కూళ్లలో 30 మంది వరకు 1 ఎస్జీటీ కేటాయిస్తున్నది. ఉన్నత పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్‌ ఏర్పాటు చేసే క్రమంలో అది మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ అయితే ఐదు మంది టీచర్లను ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా కానప్పుడు 1 నుంచి 10 మంది వరకు ఇద్దరు టీచర్లను, 11 నుంచి 30 మంది వరకు ముగ్గురు టీచర్లను, 31 నుంచి 40 వరకు నలుగురిని 45 పైబడితే మోడల్‌ స్కూల్‌ గా పరిగణించి 5 మందిని ఇచ్చే ప్రతిపాదన ఉన్నది. ఇదే ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి విధానాన్ని బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌, ఫౌండేషన్‌ స్కూళ్లకు కూడా వర్తింపజేయాలి.
– వాసిలి సురేష్‌, నెల్లూరు జిల్లా .

➡️