పనుల వేగం పెరగాలి!

రాష్ట్ర రాజధాని అమరావతికి 57 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్స రాలు పడుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. 57 కిలో మీటర్ల మార్గానికి అంత సుదీర్ఘ కాలం పట్టడం ఆశ్చర్యంగా ఉంది! వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి బుల్లెట్‌ ట్రైన్‌ అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉంది. నిజానికి ఈ ప్రతిపాదిత మార్గం ఒక రైలు మార్గం నుంచి మరో మార్గానికి అనుసంధా నించడమే. అదీ పూర్తిగా మైదాన ప్రాంతం! ఒక్క కృష్ణా నదిపై రైల్వే బ్రిడ్జి తప్పితే మిగిలిన పనులు ఒకటి, రెండు సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. రైల్వే బ్రిడ్జి కూడా ఇప్పుడు మొదలు పెడితే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు! భూసేకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. నిర్మాణ పనులను విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి కాలయాపన చేయకుండా పనుల్లో వేగం పెంచితే రెండు సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖపై పనుల వేగానికి ఒత్తిడి పెంచాలి.

– గరిమెళ్ల రామకృష్ణ,
ఏలూరు, ఏలూరు జిల్లా.

➡️