వచ్చేది పుణ్యం కాదు.. అంటు రోగాలు

Jan 12,2025 04:55 #Articles, #edit page, #kumbh mela

జనవరి 13 నుండి ప్రయాగలో 45 రోజుల పాటు మహా కుంభమేళా జరుగుతుంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారు. ‘పుష్కరాలలో మునిగి పుణ్యం సంపాదించుకోండి’ అంటూ తెగ ప్రచారం జరుగుతున్నది. లక్షలాది మంది ప్రజలు నీళ్ళలో మునిగితే వచ్చేది పుణ్యం కాదు. అంటు రోగాలన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటె నీళ్లలో మునిగినపుడు, మనం స్నానం చేస్తున్నపుడు సహజంగా మూత్రం వదులుతాం. అది జీవ లక్షణం. మరి పుష్కరాలలో అన్ని లక్షల మంది మునిగినపుడు పరిస్థితి ఏంటి? అన్ని లక్షల మందికి టాయిలెట్లు కూడా ఉండవు. మరి నీళ్ళలో మునిగినపుడు ఆ నీళ్ళు తప్పని పరిస్థితుల్లో నోట్లోకి పోతాయి. అది పవిత్రమా! అలాగే అఘోరీలు కూడా లక్షలమంది మునుగుతారు. కనుక పుష్కరాలలో మునిగి అంటురోగాలు తెచుకోవద్దని మనవి. పైగా పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందని ప్రభుత్వాలు ప్రచారం చెయ్యటం రాజ్యాంగ విరుద్ధం.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️