May 29,2023 21:51

సీతానగరం : రోగులను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-సీతానగరం:  మండలంలోని లక్ష్మీపురం సచివాలయం పరిధి ఏగోటివలసలో పెదంకలాం పిహెచ్‌సి వైద్యాధికారి ఎం.రమాకాంత్‌ ఆధ్వర్యంలో సోమవారం ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రోగులను తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ గోపాలరావు, ఎఎన్‌ఎం బి.రమాదేవి, ఎంఎల్‌హెచ్‌ఒ కె.హరిప్రియ, ఆశా కార్యకర్త రమాదేవి పాల్గొన్నారు.
అచ్చిపువలసలో ఫ్యామిలీ డాక్టర్‌
వీరఘట్టం: స్థానిక మేజర్‌ పంచాయతీ పరిధిలోని అచ్చిపువలస గిరిజన గ్రామంలో సోమవారం 104 ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జి.ప్రదీప్‌ కుమార్‌ జ్వర పీడితులు, గర్భిణీలు, బాలింతలు, మధుమేహ,రక్త పోటు తదితరమైన వారికి తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జి.ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ ఒ.శాంతకుమారి, ఎఎన్‌ఎం రాజేశ్వరి, ఎంఎల్‌హెచ్‌పి, టెక్నీషియన్‌, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.