Oct 27,2021 19:33

హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఆమె సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌ పెట్టడం.. అది కాస్తా వైరల్‌గా మారడం జరుగుతుంది. ఈసారి పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పోస్ట్‌ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఆడపిల్లలను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా పెంచాలని ఇండియా హాకీ టీమ్‌ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ పోస్ట్‌ చేసిన ఒక పోస్ట్‌ని సామ్‌ షేర్‌ చేసింది. ''మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేదానిమీద కంగారు పడకండి.. ఆమె పెళ్లికి దాచే డబ్బులను ఆమె చదువుకు ఉపయోగించండి. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేయండి. మొదట ఆమెను ఆమె ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడం నేర్చుకోనివ్వండి.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి'' అని పోస్ట్‌ పెట్టింది.