
ఖాట్మండు : నవంబరు 20న నేపాల్లో ఒకే విడతగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ సిఫార్సుతో మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతినిధుల సభ, ప్రావిన్షియల్ అసెంబ్లీలకు నవంబరు 20న ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జ్ఞానేంద్ర బహదూర్ మీడియాకు తెలిపారు. 2017 నవంబరు 26, డిసెంబరు 7తేదీల్లో రెండు దశలుగా దిగువసభకు, ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఐదు పార్టీల పాలక సంకీర్ణం బుధవారం సమావేశమై ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది.