Jan 16,2021 07:03

ఏమైనా చేస్తాడు...
మనలో ఐకమత్యం లేనప్పుడు
ఎంతకైనా తెగిస్తాడు..
మనలో పోరాట పటిమ పోయినప్పుడు!
తన పరాజయాలకి తన్నుకొచ్చిన
అసహనాన్ని మన మీదే కుమ్మరిస్తాడు.
అందరికీ హెచ్చరికగా ...
ఒకరి నోటి దగ్గర కూడు లాగేస్తాడు..
విశ్రాంత జీవితపు భరోసాని కూడా
కర్కశంగా తన్నేస్తాడు...!
అయినా... ఏమీ చేయలేమా?
కొత్త ముసుగులో వస్తున్న ఫ్యూడలిజాన్నీ-
పాతకాలపు బానిస భావాల వెల్లువనీ
ధైర్యపు కవచంతో ఎదుర్కోలేమా?
శతాబ్దాల పోరాట చరిత నేర్పిన
పాఠాలను గుర్తు చేసుకుని ...
అమరజీవుల త్యాగాలను స్ఫూర్తిగా
నరనరానా నింపుకొని ..
పిడికిళ్ళు బిగించలేమా?
బిగుసుకుపోయిన చట్టాల చట్రాన్ని
మన సంకల్పపు జ్వాలలతో
తుత్తునియలు చేయలేమా...?
ఆలోచించండి....
గిత్తల పోట్లాటలో ...
లేగదూడలు నలిగిపోవలసిందేనా...?
                               * బి. బొల్లాప్రగడ వెంకట పద్మరాజు, సెల్‌ : 98498 99676