Sep 27,2021 15:40

ప్రజాశక్తి : ఎమ్మిగనూరు
పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు (ఐ వి) పై అధికార పార్టీ విజయవాడ సెంట్రల్‌ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ఇష్టారాజ్యంగా మాట్లాడి అవమానించడం తగదని వెంటనే క్షమాపణ చెప్పాలని యుటిఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి యన్‌.నాగమణి,జిల్లా అధ్యక్షుడు జె.యల్లప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక యు టిఎఫ్‌ ప్రాంతీయకార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఐవి పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలను ఉపసంహారించుకోని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ నిరసనకార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఐదుగురు ఏమి చేయగలరులే అనే అహాంకారపూరితంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. ఈ ఐదుగురి వెంటనే లక్షాలది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు , విద్యార్థి యువజనులు వున్నారనే విషయాన్ని గుర్తుంచుకోని మాట్లాడాలనీ, సమావేశంలో సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం దఅష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు అసహానంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తుందనిఎమ్మెల్యే విష్ణుకు దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగ సంఘాలకు పాదయాత్ర ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను సిపిఎస్‌ రద్దు,సకాలంలో పిఆర్సి అమలు,డిఏ బకాయిల చెల్లింపు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 40 సంవత్సరాలుగా ఉద్యమకారునిగా ఉన్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావును తులనాడటం సిగ్గుచేటన్నారు. మడమ తిప్పను మాట తప్పను అనే పదాలు బాగున్నాయి కానీ ఆచరణలో పెట్టి నిరూపించుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సూచించారు. ఇప్పటికైన మల్లాది విష్ణు మేల్కోని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహారించుకోని క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు మల్లారి నాగరాజు, దావీదు, రాఘవేంద్ర,శ్రీదేవి, చంద్రకళ,కౌలన్న,దేవపాల్‌, రామాంజనేయులు, చిన్నయల్లప్ప, లక్ష్మన్న,రాజు,గురుస్వామి, రవికుమార్‌, ప్రసాద్‌ చంద్రపాల్‌,బాబు,హానీఫ్‌, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.