Oct 03,2022 22:57

ప్రజాశక్తి - అంబాజీపేట
టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ను ఆయన స్వగహంలో పి.గన్నవరం నియోజకవర్గ టిడిపి శ్రేణులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్‌టిఆర్‌ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య ఎంఎల్‌ఎ రాజప్పకి పుష్పగుచ్చం అందజేసి శాలువాకప్పి సత్కరించారు. జిల్లా ఎస్‌సి సెల్‌ అధికార ప్రతినిధి చిన్నం విజయారావు,లక్ష్మీదంపతులు, గల్లా అశోక్‌, మోకా శ్రీను, కె.వెంకటేశ్వరరావు, తదితరులు కలసి ఎంఎల్‌ఎ రాజప్పకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.