Oct 03,2022 22:59

ప్రజాశక్తి -అయినవిల్లి
విలస గ్రామా నికి చెందిన అయినవిల్లి మండలం ఎంఆర్‌పిఎస్‌ మాజీ అధ్యక్షులు సవరపు అబ్రహంను డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర కోనసీమ జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యధర్మిగా నియమించారు. మహాజన సోషలిస్టు పార్టీ సమావేశం జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ సత్తిబాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంఎస్‌పి ఇన్‌ చార్జి ముమ్మిడివరపు చిన సుబ్బారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఒసిల్లో ఉన్న వెనకబడి వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని మంద కష్ణ ఎంఎస్‌పిని స్థాపించడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఎంఎస్‌పి బలోపేతానికి కషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నూటుకుర్తి సత్యనారాయణ, జిల్లా ప్రచారకార్యదర్శి లంక రామకష్ణ, సీనియర్‌ నాయకులు రాయి బులిరెడ్డి, పి.గన్నవరం నియోజక వర్గం అధ్యక్షులు ఎదునూరి వెంకట్రావు కొత్తపేరు నియోజక వర్గం అధ్యక్షులు గంధం యాకోబు అమలాపురం నియోజక వర్గం అధ్యక్షులు లూటుకుర్తి చిన్న, చుట్టుగుళ్ల నీలకంఠం, సవరపు భీమేశ్వరావు, ఇతకోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.