Jun 02,2023 00:16

దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-మద్దిపాడు : మహిళా రెజ్లర్లకు మద్దతుగా సిఐటియు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె. మాబు మాట్లాడుతూ నెల రోజులుగా ఢిల్లీలో మహిళా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. క్రీడల్లో రెజ్లర్లకు వచ్చిన మెడల్స్‌ను సైతం వారు గంగానదిలో వేయడానికి సిద్ధపడ్డారని తెలిపారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. అనంతరం ఎంపీ బిజ్రూ భూషన్‌ దిష్టి బొమ్మకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరావు నిప్పు అంటించారు. రెజ్లర్లకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయంతిబాబు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెంట్యాల హనుమంతురావు, సిఐటియు మండల అధ్యక్షుడు కాసిం, ఐద్వా మండల అధ్యక్షురాలు అనంతలక్ష్మి, నాగులుప్పలపాడు మండల కౌలు రైతు సంఘం నాయకులు తాటిబండ్ల యోహాను, మద్దిపాడు మండల సిఐటియు కార్యదర్శి ఉబ్బా ఆదిలక్ష్మి, కనపర్తి సుబ్బారావు, పాలపర్తి యోన, గాదె నాగేశ్వరరావు, చెరుకూరి వాసు, కనపర్తి ఇర్మియా తదితరులు పాల్గొన్నారు.