Feb 07,2023 00:31
మాట్లాడుతున్న సర్పంచి గ్రూపు నాయకులు

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని ఏల్చూరు గ్రామంలో వైసీపీలోని, రెండు వర్గాలు అయిన ఎంపీటీసీ ఓరుగంటి కోటిరెడ్డి వర్గం, సర్పంచి మందా సూరిబాబు, గాలెయ్య వర్గాల మధ్య ఒకరిపై ఒకరు నిధులు గోల్‌ మాల్‌పై అభియోగాలను తెలుపుతూ విలేకరుల సమావేశంలో ఆరోపిస్తు న్నారు. వివరాల్లోకి వెళితే.. గత శనివారం ఎంపీటీసీ ఓరుగంటి కోటిరెడ్డి తన నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, 2021వ సంవత్సరం నుంచి 2023 జనవరి వరకు, సర్పంచి మందా సూరిబాబు, గాలెయ్య వర్గం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే 36 లక్షల రూపాయల ను దోచు కున్నారని ఆధారాలతో పత్రిక సమావేశంలో వివరించారు. అందుకు ప్రత్యేకం గా సోమవారం నాడు సర్పంచి వర్గం పంచాయ తీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. గ్రామంలో తాము చేసిన అన్ని పనులు బిల్లులతో సహా, ఫోటోలతో సహా ఉన్నాయన్నారు. దీనికి ఎంపీటీసీ కోటిరెడ్డి ఆరోపణలకు అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. ఎంపీటీసీగా ఉన్న కోటిరెడ్డి ఒక కోటి 25 లక్షల రూపాయలు నిధులకు దొంగ బిల్లులు పెట్టి, ఎటువంటి పనులు చేయకుండా అప్పటి అధికారులతో కుమ్మక్కై గ్రామ నిధులను స్వాహా చేశారని పలు ఆధారాలతో సమర్పించా రు. 14 వేల జనాభా కలిగిన ఏల్చూరు గ్రామంలో అధికార వైసిపి పార్టీలో రెండు వర్గాలుగా ఏర్పడి దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా, వీరి వ్యవహారశైలి ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైసిపి గ్రామ నాయకుడు ఇప్పల ముసలారెడ్డి, గ్రామ వార్డు మెంబర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.