Apr 20,2021 22:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజినీరింగ్‌, మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్‌ పేరును మార్చింది. ఆ స్థానంలో ఇఎపిసెట్‌గా మార్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత ఎంసెట్‌లో ఉన్న మెడికల్‌, డెంటల్‌ అనే పదాలను అందులో నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుగా పిలిచే ప్రవేశపరీక్షను ఇకముందు ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుగా పిలవనున్నట్లు పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం మెడికల్‌ అనే పదాలు ఎక్కడున్నా చట్టం నుండి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యా సంస్థలు చట్టం 1983లోని సెక్షన్‌ా5లో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.