Mar 28,2023 00:37
ఆసరా చెక్కు నమూనాను డ్వాక్రా మహిళలకు అందిస్తున్న బాచిన కృష్ణ చైతన్య

ప్రజాశక్తి-పంగులూరు: దేశం మొత్తంలో ఎన్నికల హామీను 99 శాతం అమలు చేసిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని అద్దంకి వైసిపి ఇన్చార్జ్‌, ఆంధ్రప్రదేశ్‌ శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కష్ణ చైతన్య అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పంగులూరు హై స్కూల్‌ లో జరిగిన మూడో విడత వైయస్సార్‌ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, అధికారం రాగానే మర్చిపోయారని గత ప్రభు త్వాన్ని ఎద్దేవా చేశారు. మూడో విడత వైయ స్సార్‌ ఆసరా పథకం ద్వారా మండలానికి ఏడు కోట్ల రూపాయలు, 900 డ్వాక్రా మహిళలు లబ్ధి పొందాలని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య మాట్లాడుతూ మహి ళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న జగన్‌ మరోసారి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని ఆరోజు చెప్పారని, ఈరోజు దేశంలోనే ప్రధాన నగరాలతో పోటీపడుతూ అభివృద్ధి దిశగా దూసుకు పోతుందని, ఇది ఎలా సాధ్యమైంది? అని ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోండి అని కోరారు. పురుషులతో సమానంగా మహిళలు అబివృద్ధి చెందాలని మండల వైసీపీ కన్వీనర్‌ యర్రం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి రాయిణి ప్రమీల, ఎంపీపీ తేళ్ల నాగమ్మ, ఎంపీటీసీ రాములు, మండల అభివద్ధి కమిటీ అధ్యక్షుడు రాయిని వెంకటసుబ్బారావు, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ ఖాసిం, ఏపిఎం జ్యోతి ప్రసాద్‌, సిసి దాసు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.