
సంతమాగులూరులో అధ్యక్ష ఎన్నిక జరిగే హాలును పరిశీలిస్తున్న ఆర్డీవో సరోజినీ
ప్రజాశక్తి-సంతమాగులూరు: ఈనెల 3వ తేదీ శుక్రవారం నాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికను పకడ్బందీగా జరపాలని చీరాల ఆర్డిఓ సరోజిని అధికారులకు సూచిం చారు. బుధవారం సంతమాగులూరులోని అధ్యక్ష ఎన్నిక జరిగే మండల పరిషత్ సమావేశం హాలును ఆమె పరిశీలించారు. ఈ ఎన్నిక ఏర్పాట్లను ఎంపీడీవో ఎం సాంబశివరావును అడిగి తెలుసుకున్నారు. అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ నాగశివారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజేష్, డిప్యూటీ సీఈఓ హనుమంతరావు, తహశీల్దారు అశోక్‌వర్దన్, విస్తరణాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.