
ప్రజాశక్తి-కొండపి: గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఫ్రంట్ అభ్యర్థులదని పెరిదేపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లెల కొండయ్య తెలిపారు. శుక్రవారం పెరిదేపి పంచాయతీ గ్రామ అభివృద్ధి ఫ్రంట్ తరుపున సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రంట్ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నో పోరాటాలు చేసిన ఘనత పెరిదేపి గ్రామంలో ఫ్రంట్ నాయకులకే దక్కుతుందన్నారు. పేదవారికి నివేశన స్థలాలు ఇప్పించిన ఘనత కూడా ఉందన్నారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు కెజి మస్తాన్, అంగలకుర్తి బ్రహ్మయ్య, పేతురు, సందడి కొండయ్య, మోషే, సిహెచ్ బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.