Sep 22,2022 23:58

ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -అచ్చుతాపురం
ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడంపై టిడిపి నిరసన చేపట్టింది. మండలంలోని మోసయ్యపేట గ్రామంలో గురువారం ఎన్టీఆర్‌ విగ్రహానికి టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు చేతుల మీదుగా పాలాభిషేకం చేసి, పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్థాపించిన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చడం ముఖ్యమంత్రి అవివేకితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజాన రమేష్‌ కుమార్‌, ధూళి రంగనాయకులు, దాడి ముసలి అప్పారావు, మెరుగు బాబు నాయుడు, ధర్మిరెడ్డి నాయుడు బాబు, జనపరెడ్డి నర్సింగరావు, దిన్‌ బాబు, కసిరెడ్డి అప్పలస్వామి నాయుడు, నీరుకొండ నర్సింగరావు, కొయ్య శ్రీనివాసరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయడమే
అనకాపల్లి : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని మాజీ శాసనసభ్యులు, పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిర్మించ లేనివారికి పేరు మార్చే అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అసలు మంజూరు కాని వైద్య కళాశాలను 2023కి పూర్తి చేస్తామని స్థానిక ఎంపీ సత్యవతి, మంత్రి రజిని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పచ్చ కూర రాము, షేక్‌ బాబర్‌, జోగి నాయుడు, కొణతాల శ్రీను, కలగా సన్యాసినాయుడు, సిద్ది రెడ్డి ప్రసాద్‌, నాగరాజు, పెట్ల హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.