May 28,2023 18:12

ప్రజాశక్తి-యంత్రాంగం
టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ సిఎం ఎన్‌టిఆర్‌ శత జయంతిని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహాలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు పూల మాలలువేసి ఘన నివాళులు అర్పించారు.
మండపేట మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ శతజయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు మండలంలోని ఏడిద, మారేడుబాక గ్రామాల్లో కొలుపుటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, మేక జేజుబాబు, పసలపూడి శ్రీనివాస్‌ లు ఎన్‌టిఆర్‌ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింప జేసిన మహోన్నత నాయకుడు ఎన్‌టిఆర్‌ అని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, షేక్‌ ఇబ్రహీం, గుండు వీరతాత రాజు, వాకచర్ల గుప్తా తదితర్లు పాల్గొన్నారు.
ఆలమూరు ఎన్‌టిఆర్‌ శతజయంతిని మండల పరిధి 18 గ్రామాల్లో వాడవాడలా టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్‌టిఆ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ పంపిణీ చేశారు. భారీ ఎత్తున బైక్‌ ర్యాలీలతో వేమగిరిలో జరుగుతున్న శతజయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలే ఆదర్శమై ఇప్పటికి సంక్షేమ పధకాలుగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు మెర్ల గోపాల స్వామి, ఈదల సత్తిబాబు, రామానుజుల శేషగిరిరావు, సిద్దిరెడ్డి పెద్దకాపు, వంటిపల్లి సతీష్‌, ఈదల నల్లబాబు, ఆకుల రామకష్ణ, నైనాల శ్రీరామచంద్రమూర్తి, నాగిరెడ్డి వెంకటరత్నం, రాయుడు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.