Feb 23,2021 11:36

విజయ్ ‌సేతుపతి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినపడుతోన్న పేరు. తెలుగు, తమిళంలో హీరోగా సినిమాలు చేస, ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రల్లో నటిస్తూ.. అశేష ప్రేక్షకులను సంపాదించుకున్నారు విజయ్‌ సేతుపతి. తాజాగా తాను నటించిన 'మాస్టర్‌', 'ఉప్పెన' చిత్రాలు తెలుగులో హిట్‌లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా కనిపించాడు. దీంతో టాలీవుడ్‌కు మరో పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడు దొరికినట్లయింది. ప్రస్తుతం టాప్‌ దర్శకులందరూ అతని డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారంటే తెలుగులో ఎంతలా క్రేజ్‌ సంపాదించారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో నటిస్తున్న సినిమాలో విలన్‌గా విజయ్‌ సేతుపతిని తీసుకుంటే బాగుంటుందని ఆ చిత్ర బృందం పరిశీలిస్తోందట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి ఓ భారీ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌ నటించనున్న 30వ చిత్రం. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో బిజీగా వున్నారు. ఇది పూర్తవ్వగానే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది. వీరి సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌గా విజయ్‌ సేతుపతిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ డిమాండ్‌ మేరకు ఎన్టీఆర్‌ని ఢీకొట్టే పాత్రలో విజరుసేతుపతి అయితేనే పవర్‌ఫుల్‌గా వుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట.