Feb 06,2023 21:44

ఏనుగుల దాడిలో మృతి చెందిన లక్ష్మీనారాయణ

భామిని: మండలంలోని పసుకుడి గ్రామం సమీపాన వంశధార తీరప్రాంతంలో ఏనుగుల దాడిలో లోకుండ లక్ష్మీనారాయణ(25) అనే ఎలిఫెంట్‌ కేర్‌ ట్రాకర్‌ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి 7.30గంటలకు చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఐ.హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం లోకుండ లక్ష్మీనారాయణ గత ఐదేళ్లుగా ఎలిఫెంట్‌ కేర్‌ ట్రాకర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సెలువుపై వెళ్లిన లక్ష్మీనారాయణ సోమవారం విధుల్లోకి వచ్చాడు. వచ్చిన రోజే సాయంత్రం ఏనుగుల తరలించే క్రమంలో జారిపడిపోయాయి. దీంతో నాలుగు ఏనుగులు ఒకేసారి దాడి చేయడంతో చనిపోయాడని తెలిపారు. మతుడి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి. గత కొన్ని రోజులుగా 13 మంది ఎలిఫెంట్‌ కేర్‌ ట్రాకర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఏనుగుల దాడిలో సహచరుడు చనిపోవడంతో తోటి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు.