శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏదో ఒక రోజు కమ్యూనిజందే విజయం : శోభిత వీడియో వైరల్ ..!

05 ఆగస్టు, 2026

Communism will triumph one day: Shobhita's video goes viral!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : ఇండస్ట్రీలో ఉన్న సమయంలో కొందరు సినీనటీనటులు రాజకీయాలు గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడితే మళ్లీ తమ సినిమాలకు ఏమైనా ఇ‍బ్బందులు వస్తాయేమో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మొహమాటం లేకుండనే మాట్లాడేస్తుంటారు. అలా అక్కినేని కోడలు శోభిత.. కమ్యూనిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ' నాకు రాజకీయాలపై బలమైన అభిప్రాయం ఉంది. నాకు వామపక్ష భావజాలం చాలా ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే కచ్చితంగా విజయం సాధిస్తుంది ' అని సదరు వీడియోలో శోభిత చెబుతున్నట్లు ఉంది. అయితే ఇది ఎనిమిదేళ్ల ‍క్రితం నాటి వీడియో. 'గూఢచారి' మూవీ ప్రమోషన్ల టైంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో శోభిత ఇలా చెప్పింది. శోభిత ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో గానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సదరు వీడియో వైరల్ అవుతుంది. ధైర్యంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పిందని కొందరు మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ఈమెని విమర్శిస్తున్నారు. సినీనటిగా కొనసాగుతూ లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవిస్తూ శోభిత, కమ్యూనిజం గురించి మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అప్పుడెప్పుడో చేసిన కామెంట్స్ కారణంగా శోభిత మళ్లీ ట్రెండ్ అవుతున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్