ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాన్న సిఎం కావడం చారిత్రాత్మక విప్లవం : జాసన్ సంజయ్

03 ఆగస్టు, 2026

My father becoming CM is a historic revolution: Jason Sanjay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : తన తండ్రి, సినీ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఓ చారిత్రాత్మక ఘట్టమని ఆయన కుమారుడు, సినీ దర్శకుడు జాసన్ సంజయ్ అన్నారు. సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ దర్శకుడుగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం సిగ్నా. త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఆయన మాట్లాడుతూ .... తన తండ్రి ముఖ్యమంత్రి కావడం ఓ విప్లవాత్మక ఘటన అని అన్నారు. ఆయన సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, కుటుంబంపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. తన తండ్రి రాజకీయ ప్రయాణం, ఇంట్లో ఉన్న వాతావరణం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ' మా నాన్న ముఖ్యమంత్రి కావటం ఒక చారిత్రాత్మక విప్లవం. ఆయన సిఎం అయ్యాక నాకు, మా చెల్లికి, మా ఇంట్లో వాళ్లందరిపై బాధ్యత పెరిగింది. మేం ఆయన వారసత్వాన్ని కాపాడాలి. ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు నాన్న నాకు ఓ సలహా ఇచ్చారు. సొంతంగా నాకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఎప్పుడైనా సహాయం కావాలంటే అడగమన్నారు.. కానీ, ఎంతకష్టమైనా నా కాళ్లపై నేనే నిలబడాలని ఆయన తెలిపారు ' అని సంజయ్‌ చెప్పారు. ఇక తన తల్లి సంగీత గురించి సంజయ్‌ సరదా విషయం చెప్పారు. '‘మా అమ్మ ఒక స్పైలా ఉంటుంది. నేను రహస్యంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించినా, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినా ప్రతిసారీ దొరికిపోతాను' అని తెలిపారు. గతంలో తాను అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి, మరుసటి రోజు ఉదయం తిరిగొచ్చిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారని మిస్సింగ్ కేస్ పెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో తాను ఇంటికి చేరుకున్నట్లు నవ్వుతూ వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్