దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన ‘అనకాపల్లి’ సినిమా విడుదలను ఆగస్టు 7 నుంచి ఆగస్టు 15కు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, అదే రోజున వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జి.డి. నాయుడు’ వంటి భారీ చిత్రాలు విడుదల కానుండటంతో విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది. అయితే, ‘అనకాపల్లి’పై తమకు ఉన్న నమ్మకంతో ఆగస్టు 7న అనకాపల్లి పట్టణంలో మాత్రమే ప్రత్యేకంగా నాలుగు ఆటలను ప్రేక్షకుల కోసం ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదలకు వారం ముందే ఒకే పట్టణంలో నాలుగు షోలు ప్రదర్శించడం వెనుక కారణమేంటని ప్రశ్నించగా, “ఈ సినిమాపై మాకున్న విశ్వాసమే ఇందుకు కారణం” అని సమాధానమిచ్చారు. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించగా, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన తన మిత్రుడు కాండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మించారు.
Print Edition ‘అనకాపల్లి’ ఆగస్టు 15కి వాయిదా
05 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)