‘అన్నీ నువ్వే అమ్మకు..’

Feb 27,2024 19:05 #movie, #varun tej

వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం నుంచి తాజాగా ‘అన్నీ నువ్వే అమ్మకు..’ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. మిక్కీజే మేయర్‌ సంగీతం అందించిన ఈ పాటను రమ్య బెహరా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌ నిర్మించారు. గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (వకీల్‌ ఖాన్‌), నందకుమార్‌ అబ్బినేని సహ నిర్మాతలు. మార్చి 1న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

➡️