చిరంజీవి జీవిత చరిత్ర రాస్తున్నా …

Feb 10,2024 08:05 #movie, #vireendranadh

హీరో చిరంజీవి జీవితచరిత్ర పుస్తకాన్ని రాసే పనిలో నిమగ్న మై ఉన్నానని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ వెల్లడించారు. ‘చిరంజీవి నటించిన ‘మంచుపల్లకి’ సినిమాకు నేను డైలాగులు రాశాను. ఆ తర్వాత 40 సంవత్సరాలు మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉన్నాం. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నాలుగేళ్ల తర్వాత చిరంజీవి ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని భయపడ్డా. కానీ, ఆయన మాత్రం చాలా ప్రేమతో పలకరించారు. మీ జీవిత చరిత్ర రాస్తే బాగుంటుందని చెబితే ఆయన విని ఆశ్చర్యపోయారు. ‘నిజంగా రాస్తారా.. నువ్వు రాస్తే అంతకంటే కావాల్సిందేముంది? ఇప్పుడే ప్రకటించమంటావా’ అని చిరంజీవి అడిగారు. ‘నేను ఓకే చెప్పటంతో ఆ స్టేజ్‌ పైనే ఈ విషయాన్ని వెల్లడించారు’ అని వివరించారు.

➡️