‘చౌర్య పాఠం’తో నిర్మాతగా …

Feb 10,2024 19:20 #movie

దర్శకుడు త్రినాధరావు నక్కిన నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కించారు. నక్కిన నెరేటివ్స్‌ బ్యానర్‌పై నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్‌ కథానాయకుడిగా ఈ సినిమా లాంచ్‌ అయింది. క్రైమ్‌ కామెడీ డ్రామాగా ‘చౌర్య పాఠం’ పేరుతో ఇది రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని శనివారం విడుదల చేశారు. సినిమాటోగ్రాఫర్‌, ఈగల్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి కథను అందించారు. నిఖిల్‌ గొల్లమారి వినోదభరితంగా రూపొందించారని తెలుస్తోంది. పాయల్‌ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, రాజీవ్‌ కనకాల, మస్త్‌ అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

➡️