జులై 12న హిందీ ‘సూరారైపొట్రు’

Feb 13,2024 19:16 #akshay kumar, #movie

సుధా కొంగర తెరకెక్కించిన తమిళ సినిమా ‘సూరారైపొట్రు’ చిత్రాన్ని బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేశారు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ సహా సినిమా రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘సఫారీయా’ అనే టైటిల్‌ని పెట్టారు. టైటిల్‌ రిలీజ్‌ చేస్తూ.. చిన్న గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. జులై 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఈ గ్లింప్స్‌ వీడియోలో ప్రకటించారు.

➡️