తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్‌

Feb 11,2024 19:26 #movie

ఆదివారం ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. దర్శకులు వీర శంకర్‌, సముద్ర ప్యానెల్‌లు బరిలోకి దిగాయి. ఈ పోటీలో వీరశంకర్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్షుడిగా డైరెక్టర్‌ వీర శంకర్‌ ఎన్నికయ్యారు. వైస్‌ ప్రెసిడెంట్స్‌గా వశిష్ఠ, సాయి రాజేష్‌.. జనరల్‌ సెక్రటరీలుగా మద్దినేని రమేష్‌ , సుబ్బారెడ్డి.. ట్రెజరర్‌గా పి.వి. రమణరావు విజయం సాధించారు. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్‌ మెంబర్స్‌ ఉన్నారు. ఇందులో మొత్తం 1113 ఓట్లు పోలవగా వీరశంకర్‌కు 536 రాగా సముద్రకు 304 వచ్చాయి.

➡️