బాలీవుడ్‌కు సాయిపల్లవి ఎంట్రీ?

Feb 13,2024 19:20 #movie, #sai pallavi

టాలీవుడ్‌ హీరోయిన్‌ సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ప్రవేశించనున్నారు. 2022లో వచ్చిన గార్గి చిత్రం ద్వారా ఆమె కొన్ని రోజులు సినిమాలకు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్‌ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో శివ కార్తికేయన్‌ హీరోగా, రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ఖాన్‌ నటిస్తున్న రెండో చిత్రంలో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జపాన్‌లో మంచు పండుగతో బిజీగా గడుపుతున్నారు. అక్కడి సపోరో ప్రాంతంలో బాలీవుడ్‌ చిత్రబృదం మంచు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సెట్స్‌లోని వర్కింగ్‌స్టిల్స్‌ కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రాంతంలో సినిమా తీయటానికి అనుమతి దొరికినట్లుగా సమాచారం. సునీల్‌పాండే దర్శకత్వంలో అమీర్‌ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

➡️