విరామం నుండి వచ్చేసిందిసమంత

Feb 11,2024 19:30 #movie

ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనడం లేదు. మయాసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె ‘ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి చికిత్స తీసుకుంటున్నా’ అని గతంలో ప్రకటించారు. ఆ సమయం పూర్తి అయిన సందర్భంగా సమంత అభిమానులను ఖుషీ చేసే అప్డేట్‌ ఒకటి చెప్పారు. తాను తీసుకున్న ఏడాది టైం అయిపోయిందని, త్వరలోనే షూటింగ్స్‌ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఇన్స్టాగ్రామ్‌ స్టోరీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా చాలామంది నన్ను ఎప్పుడు షూటింగ్‌ల్లో పాల్గంటారు అని అడుగుతున్నారు. అయితే ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. త్వరలోనే నేను షూటింగ్‌లో పాల్గనబోతున్నాను. ఇన్ని రోజులు జాబ్‌ లెస్‌గా ఉన్నా.. ఇక ఇప్పుడు పని చేయాల్సిన సమయం వచ్చేసింది. నా హెల్త్‌ గురించి నా ఫ్రెండ్స్‌తో కలిసి ఒక పాడ్‌ కాస్ట్‌ ప్రోగ్రాం చేసాం. అది త్వరలోనే రిలీజ్‌ కానుంది’ అంటూ చెప్పారు. ఈ ప్రకటనతో సమంత ఫాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️