సితార పేరుతో మోసాలు చేస్తున్నారు

Feb 10,2024 19:05 #movie, #sithara

మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుకు పోలీసులు ఫిర్యాదు అందింది. నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులను ప్రజలకు పంపుతున్నట్లు మహేశ్‌ బాబు టీమ్‌ గుర్తించింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌ను అక్కడ చేర్చుతూ మాదాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానస్పద లింకులు వస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది. ఈ అంశాన్ని తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్‌ ద్వారా విడుదల చేశారు. మహేష్‌ బాబు టీమ్‌ ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద నోటిఫికేషన్‌కు స్పందించవద్దని అభిమానులకు మహేష్‌ టీమ్‌ సూచించింది.

➡️