సినీరచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

Apr 2,2024 19:25 #movie, #srirama krishna

ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో సోమవారం రాత్రి గంటలకు చెన్నైలోని తేనాపేటలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్‌ ఉన్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు డబ్బింగ్‌ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది శ్రీరామకృష్ణే. 300కుపైగా డబ్బింగ్‌ చిత్రాలకు రచయితగా పనిచేశారు. చివరిగా రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమాకు డైలాగులు రాశారు. గతంలో బంబాయి, జెంటిల్‌మెన్‌, చంద్రముఖి వంటి చిత్రాలకు అనువాద రచయితగా పనిచేశారు. బాలమురళీ ఎంఎ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకులు మణిరత్నం, శంకర్‌ అన్ని చిత్రాలకు మాటలు అందించారు. రామకృష్ణ మృతదేహానికి మంగళవారం ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

➡️